Angelina Jolie-Brad Pitt Divorce: హాలీవుడ్ జంటకు విడాకులు మంజూరు..! 3 d ago
హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్‌కు విడాకులు మంజూరు చేసారు. 8 ఏళ్ల క్రితమే ఈ జంట విడాకులకు దరఖాస్తు చేశారు. పిల్లల బాధ్యత ఎవరిదనే అంశంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో కోర్టు ఇన్నాళ్లూ విడాకులు మంజూరు చేయలేదు. 2014లో పెళ్లి చేసుకోగా..రెండేళ్లకే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఏంజెలీనా జోలీ-బ్రాడ్ పిట్ జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలు మేజర్ అయ్యేవరకు తల్లిదండ్రులే సంరక్షించాలని కోర్టు ఆదేశించింది.